భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫుల్ ఫన్ రైడ్ లా వుంటుంది – రవితేజ

Ravi Teja Promises a Complete Fun Ride with Bhartha Mahasayulaku Wignyapthi

 మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ…అందరికి నమస్కారం. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోయిన్స్ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు డీవోపీ ప్రసాద్ మూరెళ్ళ. తనతో తొమ్మిది సినిమాలు చేశాను. కొరియోగ్రాఫర్స్ శేఖర్, భాను కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఫైట్ మాస్టర్ పృద్వి ఇందులో ఎంటర్ టైనింగ్ గా ఉండే ఫైట్లు కంపోజ్ చేశారు. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ లాగా కనిపిస్తారు. సినిమాని చాలా పాషన్ తో చేశారు. ఇందులో సునీల్ తో మళ్ళీ దుబాయ్ శీను లాంటి ఫన్ చూడబోతున్నారు. 

సత్య కిషోర్ మురళీధర్ గారు గెటప్ శీను సోని అందరు కూడా అద్భుతంగా చేశారు. వీళ్ళతో కలిసి చాలా ఎంజాయ్ చేశాను. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబి, కిషోర్.. వీరి  డైరెక్షన్లో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. నెక్స్ట్ శివ నిర్వాణతో చేస్తున్నాను. ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సక్సెస్ మీట్ లో తన గురించి మాట్లాడుతాను. మ్యూజిక్ ఇరగదీసాడు. హీరోయిన్స్ చాలా బ్రహ్మాండంగా నటించారు. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మా డైరెక్టర్ కిషోర్ తిరుమల ప్రమోషన్స్ లో డాన్స్ ఇరగదీసారు. ఈ సినిమాకి టైటిల్ మా పవన్ ఇచ్చాడు. డైరెక్టర్ కిషోర్ ఈ సినిమాతో చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ సినిమా ఫుల్ ఫన్ గా ఉంటుంది. జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్స్ లో కలుద్దాం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.