హాలీవుడ్ లెవెల్లో టాక్సిక్ గ్లింప్స్ 

Toxic Drops a Powerful Glimpse

రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు (జనవరి 8) సందర్భంగా ఆయన అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే కానుకనిచ్చింది. యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic: A Fairytale for Grown-ups) నుండి ఆయన పాత్రను పరిచయం చేస్తూ ‘ఇంట్రడ్యూసింగ్ రాయా’  గ్లింప్స్‌ను నేడు విడుదల చేశారు.ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది. సుమారు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో హాలీవుడ్ స్థాయి మేకింగ్ కనిపిస్తోంది. ఒక స్మశాన వాటిక (సెమెట్రీ) నేపథ్యంలో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. అక్కడ ఒక అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుండగా, ఒక గ్యాంగ్ అక్కడకు వచ్చి “రాయా వస్తాడా?” అని చర్చించుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రాయా (యష్) ఒక లగ్జరీ కారులో ఎంట్రీ ఇస్తారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కారులో ఒక మహిళతో కలిసి రొమాంటిక్ మూడ్‌లో ఉన్న యష్, బయట బాంబు పేలుళ్లు, కాల్పులు జరుగుతున్నా ఏమాత్రం చలించకుండా తనదైన స్వైగ్‌తో బయటకు రావడం అదిరిపోయింది.గ్లింప్స్ చివరలో యష్ నోట్లో సిగార్, చేతిలో మెషీన్ గన్‌తో శత్రువుల మీద విరుచుకుపడుతూ చెప్పిన “Daddy’s Home” అనే డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది.రాజీవ్ రవి విజువల్స్, రవి బస్రూర్ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని ఒక డార్క్ అండ్ ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తీర్చితిద్దుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా మరియు రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 మార్చి 19న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో  కూడా  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.