ఒక్క రోజు ఆలస్యంగా అనగనగా ఒక రాజు ట్రైలర్ 

Anaganaga Oka Raju Trailer Delayed by One Day

స్టార్ బాయ్ నవీన్ పొలిశెట్టి మరియు మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’ . సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీ విషయంలో తాజాగా ఒక కీలక మార్పు చోటుచేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తొలుత ఈ చిత్ర ట్రైలర్‌ను జనవరి 7, 2026న సాయంత్రం 6:04 గంటలకు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే, అదే రోజు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో పాటు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ కూడా విడుదల కాబోతుండటంతో మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. సినిమాకు సరైన ప్రచారం దక్కాలనే ఉద్దేశంతో ట్రైలర్ లాంచ్‌ను ఒక రోజు వెన్నక్కి జరిపారు.

 జనవరి 8 న ఉదయం 10:00 గంటలకు శ్రీరాములు 70MM థియేటర్, హైదరాబాద్ లో అనగనగా ఒక రాజు ట్రైలర్  విడుదల చేయనున్నారు.  జనవరి 7న , క్లాష్‌ను నివారించడానికి అలాగే  సోషల్ మీడియాలో మెరుగైన రీచ్ సాధించడానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ నిర్ణయం తీసుకుంది. 

డైరెక్టర్ మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ‘భీమవరం బాల్మ ‘ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు రాబోయే ట్రైలర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచనుంది. ఈ చిత్రం జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.