సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఈ రోజు విడుదల కావాల్సిన అఖండ 2 అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది.నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కూడా అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించింది.నిన్న రాత్రే ఇండియాలో కూడా ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. అయితే మరి కొన్ని గంటల్లో ఈ షోస్ స్టార్ట్ అవుతాయనగా ప్రీమియర్స్ క్యాన్సల్ అని న్యూస్ వచ్చింది. అయితే ప్రీమియర్స్ రద్దు అయినా రేపు ఈసినిమా రిలీజ్ అవుతుందనుకున్నారు అభిమానులు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో వున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బరువెక్కిన హృదయంతో , తప్పనిసరి పరిస్థితుల కారణంగా అఖండ 2 సినిమా షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని తెలియజేయడానికి చింతిస్తున్నాము.ఇది మాకు చాలా బాధాకరమైన క్షణం, సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రతి అభిమాని మరియు సినీ ప్రేమికుడి నిరాశను మేము నిజంగా అర్థం చేసుకోగలం. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. ఈ అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. మీ మద్దతు మాకు ఎంతో విలువైనది. సానుకూలమైన అప్‌డేట్‌ను త్వరలోనే పంచుకుంటామని మేము మీకు హామీ ఇస్తున్నాము. అని నిర్మాతలు ఎక్స్ ద్వారా ప్రకటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































