శ్రీతేజ్ విషయంలో ఎలాంటి సపోర్ట్ చేయడానికైనా మేము సిద్ధం – దిల్ రాజు 

Dil Raju Assures All Possible Support for Sritej

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ (TFDC) చైర్మన్ దిల్ రాజు భరోసా ఇచ్చారు. ఈ దురదృష్టకర సంఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా దిల్ రాజు నేడు శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తండ్రి భాస్కర్‌ను ఆరా తీసిన దిల్ రాజు వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. ఈ  ఘటన జరిగిన వెంటనే అల్లు అరవింద్, అల్లు అర్జున్ స్పందించి రూ. 2 కోట్లు శ్రీతేజ్ కుటుంబానికి అందించారని దిల్ రాజు గుర్తు చేశారు. ఆ డబ్బు ద్వారా వచ్చే వడ్డీతో బాబు చికిత్స ఖర్చులు మరియు కుటుంబ పోషణ నిర్వహిస్తున్నారని తెలిపారు.అయితే, బ్యాంకు వడ్డీ ద్వారా వచ్చే డబ్బు చికిత్స ఖర్చులకు సరిపోవడం లేదని, బాబుకి ప్రతిరోజూ ట్రీట్‌మెంట్ చేయిస్తున్నామని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తన దృష్టికి తీసుకొచ్చారని దిల్ రాజు వెల్లడించారు. దీనికోసం ఎక్కువ మొత్తం కావాల్సి వస్తోందని, అందుకే మరికొంత అదనపు ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరారని చెప్పారు.ఈ విషయాన్ని తాను అల్లు అరవింద్, అల్లు అర్జున్ దృష్టికి  భాస్కర్ కుటుంబానికి వీలైనంత త్వరగా అదనపు సాయం అందేలా చూస్తానని దిల్ రాజు హామీ ఇచ్చారు.

ఇక  దిల్ రాజు హామీపై శ్రీతేజ్ తండ్రి భాస్కర్ సంతోషం వ్యక్తం చేశారు.ఘటన జరిగిన నాటి నుంచి అల్లు అరవింద్, అల్లు అర్జున్ తమ కుటుంబానికి అండగా నిలిచారని తెలిపారు. వారి సపోర్ట్ కారణంగానే  బాబు కోలుకుంటున్నాడు.ప్రస్తుతం బాబు చికిత్సకు ఎక్కువగా ఖర్చు అవుతున్న కారణంగా, తమకు ఇంకొంచెం ఆర్థిక సహాయం అందించాలని దిల్ రాజు గారిని కోరామని చెప్పారు. దిల్ రాజు గారు  సత్వరమే స్పందించి అల్లు అర్జున్ గారితో మాట్లాడి, వీలైనంత త్వరగా సహాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.