మహాలక్ష్మి క్యారెక్టర్ చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను – భాగ్య శ్రీ బోర్సే

Actress Bhagyashri Borse Says, She Feels Proud For Mahalakshmi Character in Andhra King Taluka

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. అద్భుతమైన సినిమా తీసిన మా టీమ్ అందరికీ థాంక్యూ. మహాలక్ష్మి క్యారెక్టర్ చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా గొప్ప రివ్యూలు ఇచ్చారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మేము యుఎస్ థియేటర్స్ విజిట్ చేసాము. ప్రేక్షకుల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. తప్పకుండా ఈ సినిమాని మరింత మంది చూస్తారని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.