కలెక్షన్స్ కాస్త తక్కువగానే వున్నాయి – మైత్రి రవి 

Producer Mythri Ravi Confident on Strong Run For Andhra King Taluka Next Week

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మైత్రి రవి మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఆంధ్ర కింగ్ తాలూకా అందరం కలిసి చాలా ప్రేమించి చేసిన సినిమా. మేము ఏదైతే ఆశించామో అన్ని మాకు వచ్చాయి. సినిమా గురించి మీడియా మిత్రులు చాలా అద్భుతంగా రాశారు. అయితే ప్రశంసలతో పోల్చుకుంటే కలెక్షన్స్ కాస్త తక్కువగానే ఉన్నాయి. అయితే నవంబర్ ఎండ్, అన్ సీజన్లో అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మేము ముందుగా స్లోగా ఉంటుందని ఊహించాం. ముందే ప్రిపేర్ అయ్యాం.”

“నెక్స్ట్ వీక్ అద్భుతమైన రన్ ఉటుందని నమ్ముతున్నాము. ఇక్కడి నుంచి సెకండ్ ఫేజ్ ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయి. రేపటి నుంచి థియేటర్స్ విజిట్ చేస్తాం. అభిమానుల్ని కలుసుకుంటాం. వినూత్నంగా ఏదైనా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఈ సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మా సైడ్ నుంచి మా ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఇది చాలా మంచి సినిమా. అందరూ చూడాలని కోరుకుంటున్నాం. మంచి సినిమాని ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాను. మా సైడ్ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. మీడియా నుంచి కూడా కోపరేషన్ ఆశిస్తున్నాం.”

“మా హీరో గారు, హీరోయిన్ భాగ్యశ్రీ గారు ఉపేంద్ర గారు అందరు కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రామ్ గారు ఈ సినిమాకి ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయనకీ హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. ఇంత అద్భుతమైన మ్యూజిక్ వచ్చిందంటే రీజన్ ఆయనే. డైరెక్టర్ గారు కూడా అద్భుతమైన రైటింగ్ తో సినిమాని తీశారు. భాగ్యశ్రీ గ్లామర్ తో పాటు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఉన్న హీరోయిన్. ఈ సినిమాని మేము ఇంకా ముందు ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం. ఇది ఒక మంచి సినిమా. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమాకి నార్మల్ టికెట్ రేట్స్ వున్నాయి. అందరూ సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేయండి. థాంక్యూ.” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.