కాంత ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Kaantha Shines with Strong Opening Weekend Collections

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన పీరియాడిక్ డ్రామా కాంత ఫస్ట్ వీకెండ్ లో సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.మొదటి 3 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 24.50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. అయితే ఈరోజు నుండి ఎలాంటి రన్ కొనసాగిస్తుందో అనే దానిపై విజయావకాశాలు ఆధారపడివుండనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీరియాడిక్ డ్రామా మరియు క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో నటీనటుల అద్భుతమైన నటన సినిమాలో హైలైట్ అయ్యింది.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా రానా దగ్గుబాటి , సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించారు.దుల్కర్ తో కలిసి రానా ఈసినిమాను నిర్మించాడు.

కథ : కాంత సినిమా కథ 1950ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమ నేపథ్యంలో సాగుతుంది. కథ మొత్తం దర్శకుడు అయ్య (సముద్రఖని) మరియు అతడి శిష్యుడు, స్టార్ హీరో అయిన టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్) మధ్య ఉండే ఈగో క్లాష్ చుట్టూ తిరుగుతుంది. అయ్య తన తల్లి జీవితం ఆధారంగా ‘శాంత’ అనే సినిమా తీయాలనుకుంటాడు, కానీ మహదేవన్ ఆ చిత్రంలో హీరోగా నటించడానికి టైటిల్‌ను ‘కాంత’గా మార్చమని, క్లైమాక్స్‌లో కూడా కొన్ని మార్పులు చేయాలని పట్టుబడతాడు. ఈ కారణంగా గురుశిష్యుల మధ్య గొడవలు తీవ్రమవుతాయి.

 దాంతో  వారిద్దరి చిత్రాలలో హీరోయిన్‌గా నటిస్తున్న కుమారి (భాగ్యశ్రీ బోర్సే) ఈ ఇద్దరి మధ్య నలిగిపోతూ ఉంటుంది.అయితే, సినిమా షూటింగ్ పూర్తయ్యే దశలో, సినిమా పరిశ్రమలో ఒక హత్య జరుగుతుంది. ఈ హత్య కేసును దర్యాప్తు చేయడానికి కటువుగా ఉండే ఇన్‌స్పెక్టర్ దేవరాజ్ (రానా దగ్గుబాటి) రంగంలోకి దిగుతాడు. సినిమా ప్రపంచంలోని రాజకీయాలు, ఆధిపత్య పోరు మధ్య ఈ హత్య వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. గురుశిష్యుల మధ్య గొడవకు కారణం ఏమిటి, హత్య చేసింది ఎవరు, చివరికి ఈ రెండు వర్గాల మధ్య పోరు ముగింపు ఏమిటి అనేది మిగితా కథ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.