ది ప్యారడైజ్ .. కీలక పాత్రలో సోనాలి కులకర్ణి 

Sonali Kulkarni to Portray a Powerful Character in The Paradise

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్.కాస్టింగ్ తోనే ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవుతుంది.ఇందులో విలక్షణ నటుడు మోహన్ బాబు ,కిల్ ఫేమ్ రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇక ఈ టీంలోకి ప్రముఖ నటి సోనాలీ కులకర్ణి కూడా జాయిన్ అయ్యారు. ఈసినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది.అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్ అయిన సోనాలీ కులకర్ణి, హిందీ, మరాఠీ, తమిళంతో సహా పలు భాషల్లో నటించి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు సోనాలీ కులకర్ణి పుట్టినరోజు సందర్భంగా ది ప్యారడైజ్ మేకర్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్‌కు సోనాలీ కులకర్ణి ఇచ్చిన వాయిస్ ఓవర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందులోని పవర్‌ఫుల్ డైలాగ్స్ డైనమేట్‌లా పేలాయి. ఇందులో సోనాలి పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుందట.సినిమాలో ఆమె పాత్ర అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇక చాలామంది సోనాలీ కులకర్ణికి ఇది తొలి తెలుగు చిత్రం అనుకుంటారు. కానీ, ఆమె చాలా కాలం క్రితమే మోహన్ కోడా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఎల్లమ్మ’ అనే చిత్రంలో నాజర్, రేవతి వంటి నటులతో కలిసి కీలక పాత్ర పోషించారు.ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత తెలుగులో రెండో సినిమా చేస్తున్నారు.

ది ప్యారడైజ్ ను ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.