టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, ‘నవదళపతి’ సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న పాన్-ఇండియా ఫాంటసీ థ్రిల్లర్ ‘జటాధర’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనుండగా.. మరో ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పాటలు, పోస్టర్లు అంచనాలు పెంచేసిన నేపథ్యంలో తాజాగా మరో కీలక అప్డేట్ అందించింది. సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచేలా థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. దీనిప్రకారం, జటాధర ట్రైలర్ రేపు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా జటాధర ట్రైలర్ రిలీజ్ కానుండటం విశేషం.
ఈ సందర్భంగా నేడు సోషల్ మీడియాలో.. “జటాధర శక్తి ఆవిష్కరించబడుతుంది.. డివైన్ ట్రైలర్‌కు సిద్ధంగా ఉండండి” అంటూ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ముఖ్యంగా మంచికి-చెడుకు మధ్య జరిగే పోరాటం, దైవిక అంశాలు, పవర్-ప్యాక్డ్ విజువల్స్ చూపించనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై ఉన్న అంచనాలు పతాక స్థాయికి చేరడం ఖాయం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























