సాయి అన్నకు రుణపడి ఉంటాం – నిర్మాత చైతన్య రెడ్డి 

We Are Indebted to Sai Anna says Producer Chaitanya Reddy

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ క్రేజీ పాన్-ఇండియా చిత్రం SYG (సంబరాల ఏటి గట్టు) తో అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవర్ ఫుల్ స్టొరీతూ విజువల్ ట్రీట్ కానుంది. సాయి దుర్గ తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ అసుర ఆగమన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇది గూస్‌బంప్స్‌ను తెప్పించింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సంబరాల ఏటిగట్టు (SYG)” వరల్డ్ ని ప్రజెంట్ చేసిన తీరు అద్భుతంగా వుంది. అంబిషన్‌తో కూడిన మిథికల్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంది. సాయి దుర్గ తేజ్‌ను ఒ పవర్ ఫుల్ యోధుడి పరిచయం చేస్తూ గ్లింప్స్ ప్రారంభమవుతుంది.  

సాయి దుర్గ తేజ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఎమోషన్స్ అదిరిపోయాయి. కళ్లలో మండే ఆవేశం, బలమైన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్‌లలోని ఫైర్ అన్నీ కలిపి ఆయన పాత్రను లార్జర్ దెన్ లైఫ్ ప్రజెంట్ చేశాయి. ఇది ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలవనుంది. 

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు ఈ గ్లింప్స్‌కు అద్భుతమైన గ్రాండియర్‌ను ఇచ్చాయి. సినిమాటోగ్రాఫర్ వెట్రివెల్ పళనిసామీ కెమెరా వర్క్ అదిరిపోయింది. యాక్షన్ కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవల్ లో వుంది. కాంతార ఫేమ్ బి.అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ ఎలివేట్ చేసింది ఎడిటర్ నవీన్ విజయకృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ టెక్నికల్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు.

“అసుర ఆగమనం” గ్లింప్స్ తెలుగు సినిమాకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసేలా ఉంది. సాయి దుర్గా తేజ్, రోహిత్ కె.పి. ఈ ప్రాజెక్ట్‌తో తెలుగు మిథికల్ యాక్షన్ సినిమాల స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కానుంది. 

అసుర ఆగమన గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సాయి అన్నకి హ్యాపీ బర్త్డే. అన్న సపోర్ట్ ని మర్చిపోలేము. టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సాయి అన్నని ఎంత గ్రాండ్ గా చూపించాలని అనుకున్నాము. ఆ నమ్మకంతోనే ఈ సినిమాని తీస్తున్నాము. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సాయి అన్నని చూసి మా టీమ్ అంతా చాలా ఇన్స్పైర్ అయ్యాము. ఆయనలాగా ఫిట్ గా ఉండాలని అనుకుంటున్నాము. మీకు ఎప్పటికీ రుణపడి ఉండే ప్రొడక్షన్ హౌస్ మాది. సినిమా అంటే అభిమానించే వాళ్ళు లేకపోతే ఒక ప్రొడక్షన్ హౌస్ గా మేము ఉండలేము. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ.  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.