ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రిలీజ్ 

Andhra King Taluka Teaser Out Now

డబుల్ ఇస్మార్ట్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది.షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు.ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచగా ఇక ఈరోజు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

75 సెకండ్ల నిడివితో వచ్చిన ఈ టీజర్‌ సూపర్ అనిపించింది.రిఫ్రెషింగ్ విజువల్స్ , రామ్ లుక్ ,ఎర్జిటిక్ యాక్టింగ్,బీజీఎమ్ టీజర్ లో హైలైట్ అయ్యాయి. టీజర్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. టీజర్ చూస్తుంటే రామ్ ఈ సారి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వనున్నాడని అనిపిస్తుంది.ఓవరాల్ గా టీజర్ తో సినిమాపై వున్న అంచనాలు పెంచేశారు.

హీరో ఫ్యాన్ బయోపిక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఒక స్టార్ హీరో పాత్రలో కనిపించనుండగా, అతని అభిమానిగా సాగర్ పాత్రలో రామ్ పోతినేని కనిపించనున్నాడు.తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ ద్వయం వివేక్–మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమా నవంబర్ 28న విడుదలకానుంది.ఇక రామ్ ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తుండగా, అభిమానులు కూడా ఆంధ్ర కింగ్ తాలూకాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్


మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.