నార్త్ అమెరికాలో ఈఎన్ఈ రిపీట్ దూకుడు
ENE Repeat North America Pre-Sales Cross $300K and Counting

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ఈఎన్ఈ రిపీట్' ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది . విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీ-సేల్స్‌లో ఇప్పటికే 3 లక్షల డాలర్ల ($300K) మార్కును దాటి దూసుకెళ్తోంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ద్వారా ఈ చిత్రం విడుదలవుతుండగా, ప్రీమియర్ షోలకు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతుండటం విశేషం.
తొలి భాగం కల్ట్ క్లాసిక్‌గా నిలిచి యువతను విపరీతంగా ఆకట్టుకోవడంతో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు వున్నాయి. నేటి నుంచి నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రారంభమవుతుండటంతో అక్కడి తెలుగు ప్రేక్షకులు టికెట్ల కోసం ఎగబడుతున్నారు. నలుగురు స్నేహితుల మధ్య సాగే వినోదాత్మక ప్రయాణాన్ని తరుణ్ భాస్కర్ మరోసారి తనదైన శైలిలో ఆద్యంతం నవ్వులు పూయించేలా తెరకెక్కించారు.
ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వీడియోస్










