3 మిలియన్ డాలర్ క్లబ్ లో కాంతార చాప్టర్ 1

Kantara Chapter 1 Joins the $3 Million Club in North America

కాంతార చాప్టర్ 1 ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోకూడా అదరగొడుతుంది.అందులో భాగంగా నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. అంతేకాదు ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్ ,ఫిజి లో కలిపి 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగా ఉండడంతో రానున్న రోజుల్లో ఇదే రన్ ను కొనసాగించాల్సివుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దేశ వ్యాప్తంగా కూడా ఈ సినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.కన్నడ , హిందీలో నిన్నటి తో 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.కర్ణాటక లో అయితే ఎక్స్ట్రాడినరీ రన్ ను కొనసాగిస్తోంది. ఫుల్ రన్ లో 200కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది. తెలుగులో కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో రన్ కొనసాగిస్తోంది. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 50కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఓవరాల్ గా చూస్తే 6 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.

రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందుర్ నిర్మించారు.రిషబ్ శెట్టి నటన , విజవల్స్ ,బీజీఎమ్ సినిమాలో హైలైట్ అయ్యాయి.థియేట్రికల్ రన్ తరువాత ఈసినిమా ప్రైమ్ వీడియో లోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.