కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ – మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డ్యూడ్.మైత్రికి తమిళంలో ఇది రెండో సినిమా. కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించింది.ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న థియేటర్లలోకి రానుంది.ఇక ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.డ్యూడ్ కి యు/ ఏ సర్టిఫికెట్ జారీ చేయగా 2 గంటల 19నిమిషాల రన్ టైం తో థియేటర్లోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం టీం తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తుంది.ఇప్పటివరకు ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ కాగా అన్ని సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక టీజర్ లేకుండా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.రేపు ఉదయం 11:07 గంటలకు ఈ ట్రైలర్ ను వదలనున్నారు.ట్రైలర్ ,సినిమాపై బజ్ పెంచనుంది.
యూత్ ఫుల్ ఎంటరైనర్ గా తెరకెక్కిన ఈసినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. హీరో ప్రదీప్ కు ఈ ఏడాది ఇది సెకండ్ రిలీజ్.ఫిబ్రవరి లో డ్రాగన్ తో వచ్చి కెరీర్ లో వరుసగా రెండో విజయాన్ని అందుకున్నాడు.మరి డ్యూడ్ తో హ్యాట్రిక్ కంప్లీట్ చేస్తాడో చూడాలి.అయితే డ్యూడ్ కి తెలుగులో పోటీ ఎదురుకానుంది. దీపావళి టార్గెట్ గా మరి కొన్ని సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.దాంతో బాక్సాఫీస్ వద్ద డ్యూడ్ కి పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























