ఎల్ ఐ కె రిలీజ్ డేట్ ఛేంజ్

New Release Date Announced for LIK

కోలీవుడ్ సెన్సేషనల్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) రిలీజ్ డేట్ మరోసారి మార్చక తప్పలేదు.ముందు ఈసినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.అయితే పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవ్వడం వల్ల వాయిదా వేశారు.ఆ తరువాత దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న రిలీజ్ కానుందని అనౌన్స్ చేశారు.కానీ డ్యూడ్ వల్ల ఆ డేట్ కూడా మిస్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రదీప్ రంగనాథన్ ఎల్ ఐ కె తరువాత డ్యూడ్ అనే సినిమా కూడా చేశాడు.ముందునుండే ఈసినిమా దీపావళికి రిలీజ్ కానుందని అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్.అయితే మధ్యలో ఎల్ఐకె కూడా ఆ డేట్ తీసుకోవడంతో ఒకే హీరో నటిస్తున్న రెండు సినిమాలు ఒకేసారి ఎలా వస్తాయని గందరగోళం ఏర్పడింది.అయితే హీరో రిక్వెస్ట్ తో ఎల్ ఐ కె వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

నిన్న ఎల్ ఐ కె కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. డిసెంబర్ 18న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ రాగ అంచనాలు పెంచేసింది.విగ్నేష్ శివన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ ఏడాది ప్రదీప్ కి ఇది థర్డ్ రిలీజ్ కానుంది. సమ్మర్ లో డ్రాగన్ తో బ్లాక్ బస్టర్ కొట్టగా దీపావళికి డ్యూడ్ తో వస్తున్నాడు. ఇక డిసెంబర్ లో ఎల్ ఐ కె తో రానున్నాడు. మరి ఈరెండు సినిమాలు ప్రదీప్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.