లవ్ టుడే ,డ్రాగన్ లతో వరుసగా రెండు సార్లు 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నెక్స్ట్ డ్యూడ్ తో వస్తున్నాడు.టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించింది.ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ కాగా అన్ని సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక టీజర్ లేకుండా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనెల 9న ఈ ట్రైలర్ రానుంది.ఇక ఈసినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుండడం తో తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయనున్నారు.అందులో భాగంగా ఈనెల 8న తిరుపతి లో డ్యూడ్ ప్రమోషన్స్ నిర్వహించనున్నారు.
ప్రదీప్ వరుస విజయాలతో పీక్ ఫామ్ లో ఉండడం దానికి తోడు మైత్రి నుండి వస్తున్న సినిమా కావడంతో డ్యూడ్ పై మంచి అంచనాలు వున్నాయి.యూత్ ఫుల్ ఎంటరైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమా 2 గంటల 20 నిమిషాల రన్ టైంతో రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























