యంగ్ హీరో విశ్వక్ సేన్,జాతిరత్నాలు ఫేమ్ అనిరుధ్ డైరెక్షన్ లో ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో కైదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫంకీ ఇండస్ట్రీ మీద సెటైరికల్ సినిమాగా తెరకెక్కుతుంది.ఇందులో విశ్వక్ సేన్ డైరెక్టర్ రోల్ లో కనిపించనున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి టీజర్ రానుంది. ఈనెల 10న ఈ టీజర్ విడుదలకానుంది.టీజర్ వచ్చాక సినిమాపై హైప్ మరింతగా పెరుగనుంది.ఫన్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్,మెంట్ , శ్రీకర స్టూడియోస్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.
ఇక ఈసినిమా విజయం విశ్వక్ సేన్ కు తప్పనిసరి కానుంది.రీసెంట్ గా తన నుండి వచ్చిన చివరి మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి పరాజయం చెందాయి.దాంతో విశ్వక్ ,ఫంకీ తో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.ఇక ఈసినిమా కాకుండా విశ్వక్ మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టాడని సమాచారం.త్వరలోనే ఈసినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























