ఏజిఎస్ చేతికి డ్యూడ్

Dude Tamil Nadu Theatrical Rights Bagged by AGS Cinemas

లవ్ టుడే , డ్రాగన్ లతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్లు కొట్టిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు.అందులో భాగంగా ఈహీరో నెక్స్ట్ డ్యూడ్ తో వస్తున్నాడు.టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటించింది. మరో 10 రోజుల్లో ఈసినిమా థియేటర్లోకి వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా థియేట్రికల్ రైట్స్ పెద్ద నిర్మాతల చేతుల్లోకి వెళుతున్నాయి.పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అవుతుండడం తో తమిళనాడు లో ఈసినిమాను ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేస్తుంది.దాంతో డ్యూడ్ అక్కడ గ్రాండ్ రిలీజ్ కానుంది.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ రాగ ఈవారంలో ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది.

వరుస సక్సెస్ లతో పీక్ ఫామ్ లో వున్న హీరోకి తోడు మైత్రి నుండి వస్తున్న సినిమాకావడంతో డ్యూడ్ పై తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి అంచనాలు వున్నాయి.యూత్ ఫుల్ ఎంటరైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.