ఛాంపియన్ రిలీజ్ డేట్ ఫిక్స్ 

Champion Release Date Announced

ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు,యంగ్ హీరో రోషన్ నెక్స్ట్ ఛాంపియన్ తో అలరించబోతున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాను ,జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ ,కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఛాంపియన్ ఫస్ట్ లుక్, ఆసక్తికరమైన టీజర్ గ్లింప్స్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం షూటింగ్ తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.ఛాంపియన్ డిసెంబర్ 25న, క్రిస్మస్ సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. పండుగ సీజన్,న్యూ ఇయర్ హాలిడేలలో వస్తున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్‌ బిగ్ బూస్ట్ ఇవ్వనుంది.ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ సందర్భంగా  పోస్టర్ ను  రిలీజ్ చేశారు మేకర్స్. 

ఇందులో రోషన్ లాంగ్ డార్క్ ఓవర్‌కోట్, బెల్టెడ్ వెయిస్ట్‌తో క్లాసీ లుక్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి బయటకు అడుగుపెడుతూ హీరోయిక్ ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది.ఈ సినిమాలో రోషన్ ఇప్పటివరకు చేయని విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడు.మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.