కాంతార చాప్టర్ 1.. తొలిరోజు కుమ్మేసింది

Kantara Chapter 1 Roars With Record-Breaking Collections on Day 1

రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార లెజెండ్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. సినిమా విడుదలైన తొలి రోజే అంచనాలకు మించి భారీ వసూళ్లు సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. మేకర్స్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, తొలిరోజు వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.89 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది రిషబ్ శెట్టి కెరీర్‌లోనే కాకుండా, పాన్ ఇండియా సినిమాల రేంజ్‌లోనూ ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కన్నడలోనే కాకుండా, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల దూకుడు మరింత పెరిగింది. ముఖ్యంగా ఫోక్ కల్చర్ ఆధారంగా సాగే కథ, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, రిషబ్ శెట్టి నటన, విజువల్స్ సినిమాకు బలంగా నిలిచాయి.

ప్రేక్షకులు సినిమా గురించి సోషల్ మీడియాలోనూ రివ్యూలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. “మాస్, కల్చర్, ఎమోషన్ కలయిక”గా చిత్రాన్ని కొనియాడుతున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మాణం వహించిన ఈ చిత్రం, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దసరా సీజన్‌లో ‘కాంతార లెజెండ్’ బాక్సాఫీస్ వద్ద మరింత సంచలనం సృష్టించబోతోందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.