పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నార్త్ అమెరికాలో రేర్ ఫీట్ కి దగ్గర లో వుంది.విడుదలైన రోజు నుండి సూపర్ వసూళ్లతో అదరగొడుతున్న ఈసినిమా నిన్నటి తో 4.8 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది. ఈరోజుతో 5 మిలియన్ క్లబ్ లో చేరనుంది.పవన్ కెరీర్ లో ఇదే మొదటి 5 మిలియన్ డాలర్ మూవీ. ఇప్పటికే ఈసినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఫుల్ రన్ లో 6 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓజీ జోరు కొనసాగుతుంది.నిన్నటి తో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లపైనే వసూళ్లను రాబట్టుకుంది.దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 75 శాతం కు పైగా రికవరీ చేసింది.దసరా సెలువులు ఉండడంతో ఈ వారంలో టార్గెట్ ను చేరుకోనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా 300 కోట్ల మార్క్ ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే దసరాకు కన్నడ డబ్బింగ్ మూవీ కాంతార చాప్టర్ 1 రిలీజ్ కానుంది.ఈసినిమాపై తెలుగులో కూడా అంచనాలు వున్నాయి . దాంతో ఓజీ కి బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.
గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఓజీలో పవన్ నెవర్ బిఫోర్ రోల్ లో కనిపించగా ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటించింది.ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ ,శ్రీయా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.తమన్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ సినిమాను నిర్మించింది.ఈసినిమాకు సీక్వెల్ తోపాటు ప్రీక్వెల్ కూడా రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























