ఎన్టీఆర్‌-నీల్ వేరే లెవల్లో ఉంటుంది – నిర్మాత మైత్రి రవి

NTR-Neel Project Will Set a New Benchmark in Indian Cinema, Says Producer Mythri Ravi

కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ హైదరాబాద్ వేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. కాంతార ఎక్స్ట్రార్డినరీ. రిషబ్ గారి లుక్ మైండ్ బ్లోయింగ్. ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పుడే సినిమా చూడాలనే ఫీలింగ్ కలిగింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన ఒకరిద్దరు ఎక్స్ట్రార్డినరీ సినిమా అని చెప్పారు. వాళ్ళు చెప్పింది మనస్ఫూర్తిగా నిజమవ్వాలని కోరుకుంటున్నాను.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో చాలా పెద్ద నెంబర్స్ కలెక్ట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. రుక్మిణి ఎన్టీఆర్ గారితో మేము చేస్తున్న సినిమాలో కూడా హీరోయిన్. హోంబలే ఫిలిమ్స్ వారు ఎక్స్ట్రాడినరీ సినిమాలు తీస్తున్నారు. ఎన్టీఆర్ గారు, రిషబ్ గారు బ్రదర్స్ లాగా ఉంటారు. ఎన్టీఆర్ గారితో చేస్తున్న సినిమా వేరే లెవల్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్యు సో మచ్.” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.