శికంజ మాలిక్ గా మోహన్ బాబు

Mohan Babu Stuns as Shikanj Malik in The Paradise

నాచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్.ఈ చిత్రంపై ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.ఇందులో నాని, జడల్ గా సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.ఇక ఇందులో సీనియర్ నటుడు, వెటరన్ స్టార్ మోహన్ బాబు ఇందులో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు మేకర్స్ . అందులో భాగంగా ఉదయం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా సాయంత్రం ఫుల్ లుక్ లో మరో పోస్టర్ ను రిలీజ్ చేసి క్యారెక్టర్ నేమ్ కూడా రివీల్ చేశారు. ఇందులో మోహన్ బాబు, శికంజ మాలిక్ గా పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఇక సినిమాలో మోహన్ బాబు తీసుకోవడంతో బజ్ పెరుగగా తాజాగా విడుదలచేసిన పోస్టర్స్ ఆ హైప్ ను మరింతగా పెంచుతుంది.మరి శికంజ మాలిక్ పాత్రను శ్రీకాంత్ ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.

రా & రస్టిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో కిల్ ఫేమ్ రాఘవ జ్యుయెల్ కీలక పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ ఎవరనేది రివీల్ చేయాల్సివుంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా 2026 మార్చి 26న తెలుగు, హిందీ,తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.