జనతా గ్యారేజ్ తరువాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా దేవర..ఇక గత ఏడాది ఇదే రోజున విడుదలైన ఈసినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే వార్ 2 రిలీజ్ అయ్యాక కొద్దీ రోజులు దేవర 2 షెల్వ్ చేశారని ప్రచారం జరిగింది.అంతకుముందు కూడా ఈ సీక్వెల్ విషయంలో ఇలాంటి వార్తలే రాగ స్వయంగా ఎన్టీఆరే ఓ స్టేజ్ మీద దేవర 2 పక్కా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు.అయినా కూడా దేవర 2 క్యాన్సల్ అనే వార్తలు వస్తూనే వున్నాయి. అయితే ఈ వార్తలు రూమర్స్ మాత్రమేనని అందులో ఎలాంటి నిజం లేదని తాజాగా మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు.
ఈరోజు దేవర విడుదలై ఏడాది అవుతున్న సందర్భంగా దేవర 2 కోసం సిద్ధంగా ఉండండి అంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు. సో ఎన్టీఆర్ దేవర 2 చేయనుండడం పక్కా.త్వరలోనే ఈసినిమా స్టార్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.ఈసినిమాను పూర్తి చేసి ఎన్టీఆర్ , దేవర 2 ను స్టార్ట్ చేయనున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























