నట సింహం బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం అఖండ 2.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ముందు ఈసినిమాను ఈరోజు రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడంతో వాయిదా వేశారు. ఇక కొత్త విడుదల తేదీని ఫిక్స్ చేశారు.డిసెంబర్ 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.దసరా రోజు ఈ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ప్రకటించే ఛాన్స్ వుంది.ఇక అఖండ 2 ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యిందని సమాచారం.రికార్డు ధరకు నెట్ ఫ్లిక్స్ ఈసినిమా ను దక్కించుకుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటించగా ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.పాన్ ఇండియా భాషల్లో విడుదలకానున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఇక అఖండ నుండి అపజయమే లేకుండా వరుస సక్సెస్ లతో పీక్ ఫామ్ లో కొనసాగుతున్నారు బాలకృష్ణ.వరుసగా 4 విజయాలను ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ ఈ అఖండ 2తో సక్సెస్ స్ట్రీక్ కొనసాగిస్తారో చూడాలి.ఇక ఈసినిమా తరువాత బాలకృష్ణ ,గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు.ఇంతకుముందు ఈ కాంబోలో వీర సింహా రెడ్డి రాగ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా చేయనున్నారు.వృద్ధి సినిమాస్ ఈసినిమాను నిర్మించనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























