వృషభ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన మోహన్‌లాల్

Vrushabha Teaser Released, Mohanlal Steals The Show

మలయాళ సూపర్ స్టార్, లెజెండరీ యాక్టర్ మోహన్‌లాల్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వృషభ’. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా, మోహన్‌లాల్ లుక్, ఆయన నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదరగొట్టిన మోహన్‌లాల్..

‘వృషభ’ టీజర్‌లో మోహన్‌లాల్ పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు మరియు మాస్ మ్యానరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయన నటనలో ఉన్న పరిణితి, పాత్రలోని గాంభీర్యం సినిమాపై అంచనాలను పెంచాయి. మోహన్‌లాల్ ఈ సినిమాలో ఒక రాజు పాత్రలో నటిస్తున్నారు. రాజ్యం, రాజకోట సెట్టింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే కళ్ళు చెదిరే విజువల్స్, గూస్ బంప్స్ తెప్పించే బీజీఎమ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచాయి.

బాలీవుడ్ హీరోయిన్స్, భారీ తారాగణం..

ఈ చిత్రంలో బాలీవుడ్ నటీమణులు షనయా కపూర్ మరియు జరీన్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్-థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు.

‘వృషభ’ టీజర్ సినిమా యొక్క హైప్ పీక్స్‌కు చేర్చింది. పవర్-ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సులు, ఎమోషనల్ డ్రామా, మరియు అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తాయని టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.