‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్‌డమ్ తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభూ’. తాజాగా ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఏపీ లోని చీరాలలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా షూటింగ్ కోసం వెళ్లిన నిఖిల్‌కు స్థానిక ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ ప్రేమకు ముగ్దుడైన నిఖిల్, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిఖిల్ స్పందన
ఈ మేరకు హీరో నిఖిల్ ఎక్స్ వేదికగా.. “చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం చీరాల వెళ్లినప్పుడు ఇంత భారీగా ప్రజలు స్వాగతం పలకడం చూసి ఆశ్చర్యపోయాను. ఈ ప్రేమకు కృతజ్ఞతలు. ‘వరల్డ్ ఆఫ్ స్వయంభు’ లోడ్ అవుతోంది. త్వరలోనే విడుదలవుతుంది!” అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. నిఖిల్ పట్ల అభిమానులు చూపించిన ఈ ఆదరణ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.
‘స్వయంభూ’ సినిమా విశేషాలు
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస మరియు సంగీత దర్శకుడు రవి బస్రూర్ వంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.
పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఒక పోస్టర్, టీజర్‌లు భారీగా ఆకట్టుకున్నాయి. చివరి షెడ్యూల్ పూర్తయిన తర్వాత, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం అవుతాయని చిత్ర బృందం తెలిపింది.
అనంతరం మంచి డేట్ చూసుకుని చిత్రాన్ని భారీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమాకు హైప్ మరింత పెంచిన ఈ ఘటనతో, అభిమానులు ‘స్వయంభూ’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























