కేరళలో 75 కోట్ల మార్క్ దాటిన లోకః 

Blockbuster Lokah Hits ₹75 Cr Milestone in Kerala

మలయాళం మూవీ  లోకః చాప్టర్ 1 – చంద్ర  3 వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఎక్కడా స్లో అవ్వకుండా   రాంపేజ్ కొనసాగిస్తుంది.నిన్నటి తో ఈసినిమా కేరళ లో 75 కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది. ఫుల్ రన్ లో 100 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ లేకపోలేదు.అయితే అల్ టైం రికార్డు తుడురమ్ (118 కోట్లు) కలెక్షన్స్ ను బీట్ చేయడం మాత్రం కష్టమే.ఓవరాల్ గా చూస్తే  ప్రపంచ వ్యాప్తంగా రెండు వారాల్లో లోకః 215 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 250కోట్ల మార్క్ ను  చేరుతుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తెలుగులో కొత్త లోక గా విడుదలైన విషయం తెలిసిందే.ఇప్పటికే  బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని  క్లీన్ హిట్ గా నిలిచింది.ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేశాడు.అయితే ఈసినిమాకు ఈరోజు నుండి భారీ పోటీ ఎదురుకానుంది.ఈరోజు తెలుగులో రెండు సినిమాలు రిలీజ్ అవ్వగా రెండూ హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి.దాంతో కొత్త లోక కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ పడనుంది. 

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాత గా వ్యవహరించిన ఈసినిమాను సూపర్ హీరో కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ తెరకెక్కించగా కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించింది.జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా  ప్రేమలు ఫేమ్ నస్లేన్ కీలక పాత్రలో కనిపించాడు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.