మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘పరదా’. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా, థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటినుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు, మలయాళం భాషల్లో అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే, ఆగస్ట్ 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కానీ, ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఎందుకంటే, సామాజిక సందేశం ఉన్న కథలకు ఇటీవలికాలంలో ఓటీటీ ప్రేక్షకుల నుండి ఎక్కువ ఆదరణ దక్కుతోంది.
‘పరదా’ కథేంటి?
సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, కొన్నిసార్లు అది సమాజంలో ఉన్న వాస్తవాలను, మనసుకు హత్తుకునే భావోద్వేగాలను అద్దం పడుతుంది. ఈ కోవలోనే పరదా సినిమా కథ ఒక సామాజిక ఇతివృత్తంతో రూపొందించబడింది. అనుపమ పోషించిన పాత్ర ఆ కట్టుబాట్లను ఎదురించి, తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి చేసే పోరాటమే ఈ సినిమా.
పడతి అనే ఒక గ్రామంలో తరాలుగా ఓ వింత ఆచారం ఉంటుంది. అక్కడి మహిళలు తమ భర్త, తండ్రి, తోబుట్టువులకు తప్ప మరెవరికీ తమ ముఖాలను చూపించకూడదు. ఒకవేళ ఎప్పుడైనా అనుకోకుండా ముఖం చూపిస్తే, స్థానిక దేవతను ప్రసన్నం చేసుకోవడానికి వారు ఆత్మహత్య చేసుకోవలసి ఉంటుంది. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్), రాజేష్ (రాగ్ మయూర్)ల వివాహం నిర్ణయిస్తారు పెద్దలు.
అయితే ఆశ్చర్యకరంగా వీరి నిశ్చితార్థం రోజున, సుబ్బలక్ష్మి ముఖం పూర్తిగా బహిర్గతం చేయబడిన ముఖచిత్రంతో కూడిన ఒక పత్రిక వారి ఇంట్లోకి వస్తుంది. దీంతో ఆ నిశ్చితార్థం రద్దు అవుతుంది. గ్రామంలోని సంప్రదాయం ప్రకారం, నవజాత శిశువు చనిపోకుండా ఉండటానికి ముఖం బహిర్గతం అయిన స్త్రీ ఆత్మహత్య చేసుకోవాల్సి వుంటుంది. దీంతో సుబ్బలక్ష్మి కూడా ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
ఈ నేపథ్యంలో సుబ్బలక్ష్మి, ఆమె స్నేహితురాలు రత్న (సంగీత) మరియు సివిల్ ఇంజనీర్ అమీషా (దర్శన) కలిసి ఆ మ్యాగజైన్ కవర్ వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని భావిస్తారు. అసలు తన ముఖాన్ని బహిర్గతం చేసింది ఎవరు? దీని వెనుక ఉన్నది ఎవరు? ఏం ఆశించి చేశారు? ముగ్గురు స్నేహితులు కలిసి ఈ రహస్యాన్ని కనిపెట్టారా? చివరకు ఏం జరిగింది? అన్నదే మిగతా కథ.
దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ కథను చాలా సున్నితమైన అంశాలతో, భావోద్వేగభరితంగా తెరకెక్కించారు. అనుపమ పరమేశ్వరన్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమె తన కెరీర్‌లో అత్యుత్తమ నటనను కనబరిచిందని పలువురు ప్రశంసించారు. థియేటర్లలో చూడనివారు, సామాజిక స్పృహ ఉన్న సినిమాలను ఇష్టపడేవారు ‘పరదా’ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























