ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కాగా అల్లు అరవింద్ గారి తల్లి, మరియు అల్లు అర్జున్ నానమ్మ దివంగత అల్లు కనకరత్నమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వచ్చి తన సంతాపం తెలియజేశారు. అయితే రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వచ్చి అల్లు కుటుంబానికి అండగా నిలబడటం అభిమానులందరినీ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పవన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా.. “Thank you Pawan Kalyan garu for your love & support” అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మెసేజ్ కేవలం అభిమానులకు మాత్రమే కాకుండా, మెగా ఫ్యామిలీలో ఉన్న సున్నితమైన బంధానికి నిదర్శనంగా నిలిచింది.
పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్‌లకు ఇది ఒక తాత్కాలిక ముగింపు పలికింది. కుటుంబ బంధాలకు ఉన్న విలువ, మరియు పవన్ కళ్యాణ్ చూపించిన మద్దతుపై అభిమానులు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ సంఘటన మెగా ఫ్యామిలీ ఐక్యతను మరోసారి చాటి చెప్పింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























