ది ప్యారడైజ్ నుంచి నాని బీస్ట్ మోడ్ స్టిల్ రిలీజ్

Natural Star Nani's Beast Mode Still Released From The Paradise Movie

నేచురల్ స్టార్ నాని అద్భుతమైన సినీప్రయాణం 17 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భంగా తన మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ నుంచి పవర్‌ఫుల్ స్టిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ స్టిల్‌లో నాని కంప్లీట్ బీస్ట్ మోడ్‌లో కనిపిస్తూ, ఇప్పటివరకు ఎన్నడూ చూడని ఫెరోషియస్ అవతార్‌లో ఆకట్టుకున్నారు. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్యారడైజ్‌లో నాని నెవర్ బిఫోర్ జడల్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం జిమ్‌లో ఇంటెన్స్‌గా వర్క్ అవుట్ చేస్తున్నారని ఈ స్టిల్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, రా స్టేట్మెంట్, గ్లింప్స్ వీడియోలకు నేషనల్ వైడ్‌గా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగు హైదరాబాదులో వేసిన మ్యాసీవ్ సెట్స్‌లో జరుగుతోంది.

దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ది ప్యారడైస్ 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం ఎనిమిది భాషల్లో రిలీజ్ అవుతూ, ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాలలో ఒకటిగా నిలుస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.