దక్షిణాది సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సైమా అవార్డ్స్ 2025’ వేడుక దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మేరకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 13వ ఎడిషన్‌లో భాగంగా, తెలుగు సినిమాకు సంబంధించిన అవార్డుల ప్రధానోత్సవం సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఘనంగా నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ ఏడాది అవార్డుల వేడుకలో ‘కల్కి 2898 AD’ మరియు ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలు ఆధిపత్యం చాటాయి. అల్లు అర్జున్, ప్రభాస్, రష్మిక మందన్న, సుకుమార్ వంటి స్టార్స్ అవార్డులను గెలుచుకుని మెగా, స్టైలిష్ స్టార్ అభిమానులకు డబుల్ ధమాకా అందించారు.
సైమా అవార్డ్స్ 2025 విజేతల జాబితా..
- ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
- బెస్ట్ యాక్టర్: అల్లు అర్జున్ (పుష్ప2)
- ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప2)
- ఉత్తమ నటి: రష్మిక మందన్న (పుష్ప2)
- బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవి శ్రీప్రసాద్ (పుష్ప2)
- బెస్ట్ విలన్: కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ)
- ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
- ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి 2898 ఏడీ)
- ఉత్తమ గేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి (దేవర-చుట్టమల్లే)
- బెస్ట్ కమెడియన్: సత్య (మత్తు వదలరా 2)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)
- ఉత్తమ గాయని: శిల్పారావ్ (దేవర-చుట్టమల్లే)
- ఉత్తమ పరిచయ నటి: భాగ్య శ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
- ఉత్తమ నూతన నిర్మాత: నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : తేజ సజ్జా (హనుమాన్)
- ఉత్తమ నటి (క్రిటిక్స్) : మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) : ప్రశాంత్ వర్మ (హనుమాన్)
- ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా: అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్)
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Jagapathi Babu Speech | Ghaati Movie Press Meet | Anushka Shetty | Vikram Prabhu | Krish Jagarlamudi
04:33

Kishkindhapuri Crazy Interview With Car Radio | Bellamkonda Sreenivas | Koushik Pegallapati | TFN
23:25

A Stranger Comes to Her Home With a Marriage Proposal | A Surprising Twist | Siddharth | Catherine
03:56

Happy Vinayaka Chavithi 2025 ✨ | వినాయక చవితి శుభాకాంక్షలు | Ganesh Chaturthi | Telugu Filmnagar
00:31
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























