టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి కనకరత్నమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. వృధ్ధాప్యకారణాల వలన శుక్రవారం అర్థరాత్రి దాటాక 1.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లు వారి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అల్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో అల్లు వారి అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇక మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు వైజాగ్లో జరుగుతోన్న పబ్లిక్ మీటింగ్లో ఉన్నందున ఆదివారం అల్లు అరవింద్ కుటుంబాన్ని కలిసి సంతాపం తెలుపనున్నారు. అలాగే రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్లో భాగంగా మైసూర్లో ఉన్నందున అక్కడినుంచి, అల్లు అర్జున్ ముంబై నుంచి ఈ మధ్యాహ్నం లోపు హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఇక అల్లు కనకరత్నమ్మ మరణ వార్త తెలుసుకున్న అల్లు అరవింద్ సన్నిహితులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు మరియు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే అల్లు, మెగా కుటుంబాల అభిమానులు మరియు నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నారు. అల్లు కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























