టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి తల్లి, స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో అల్లు కుటుంబంలో శోకచాయలు అలుముకున్నాయి. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అల్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అత్తగారి మృతి పట్ల తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అందులో.. “మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః” అని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























