నటీనటులు : కళ్యాణి ప్రియదర్శన్ , నస్లెన్ , శాండీ
ఎడిటింగ్ : చమన్ చక్కో
సినిమాటోగ్రఫీ : నిమిష్ రవి
దర్శకత్వం : డొమినిక్ అరుణ్
సంగీతం : జేక్స్ బిజోయ్
నిర్మాత : దుల్కర్ సల్మాన్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓనమ్ కానుకగా థియేటర్లలో విడుదలై దుమ్ము రేపుతోంది మలయాళ సినిమా లోక : చాప్టర్ 1 – చంద్ర. ఈసినిమాకు యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ రావడంతో వసూళ్ల పరంగా కేరళ లో సెన్సేషన్ సృష్టిస్తుంది.కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో లీడ్ రోల్ లో నటించగా ప్రేమలు ఫేమ్ నస్లీన్ కీలక పాత్ర పోషించాడు.డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేయగా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈచిత్రాన్ని నిర్మించాడు.ఇక తెలుగులో ఈసినిమాను కొత్త లోక గా డబ్ చేసి సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదలచేసింది.మరి ఈసినిమా ఎలా వుందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అసాధారణ శక్తులు కలిగిన చంద్ర (కళ్యాణి ప్రియదర్శన్), స్వీడన్ నుండి బెంగళూరుకు వచ్చి, రాత్రి పూట మాత్రమే ఓ కేఫ్ లో పని చేయడం మొదలుపెడుతుంది. మరోవైపు, నిరుద్యోగిగా ఉన్న సన్నీ (నస్లేన్) తన స్నేహితులు వేణు, నైజిల్‌లతో చంద్ర ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటాడు.అదే సమయంలో, మానవ అవయవాల అక్రమ రవాణా చేసే మాఫియా గ్యాంగ్, పోలీస్ ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడ (శాండీ) తో కలిసి పనిచేస్తుంది.ఈ క్రమంలో నాచియప్పకు చంద్ర పై అనుమానం కలుగుతుంది. దానికి కారణం ఏంటి ?.ఇంతకీ సన్నీ – చంద్రల మధ్య పరిచయం ప్రేమగా ఎలా మారింది,అసలు చంద్ర గతం ఏమిటి అనేది మిగితా కథ.
విశ్లేషణ:
దర్శకుడు డొమినిక్ అరుణ్ .. మన జానపద పురాణాల్లో ఉన్న లెజెండ్స్ మన మధ్యే ఉంటే ఏమవుతుంది అనే ఆసక్తికరమైన కథను ఎంచుకొని దాన్ని ఎంటర్టైనింగ్‌గా చూపించాడు.సినిమా మొదటి భాగం చాలా ఆసక్తికరంగా సాగింది.నస్లేన్ గ్యాంగ్ -కళ్యాణి మధ్య ఫన్ సీన్స్ బాగా వచ్చాయి.కళ్యాణి పాత్ర చుట్టూ ఉన్న మిస్టరీ బాగానే కొనసాగింది. కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలు కావలసినంత టెన్షన్‌ను క్రియేట్ చేశాయి.ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచుతాయి.
అయితే ద్వితీయార్థం రెండో భాగం కొంచెం నెమ్మదించినట్లు అనిపిస్తుంది.అవయవాల అక్రమ రవాణా ట్రాక్ – కళ్యాణి కథను ఇంకా ఇంటెన్స్‌గా మిళితం చేసి ఉండాలి. చాలా సందర్భాల్లో హీరోయిన్ తన ప్రాణం కాపాడుకోవడంలోనే బిజీగా ఉంటుంది. ఇది సాధారణ సూపర్‌హీరో సినిమాలకు విరుద్ధంగా అనిపిస్తుంది.దర్శకుడు ఈ విధంగా చూపడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఆయన మొత్తం యూనివర్స్‌కి చెందిన పాత్రలను ఒక్కసారిగా పరిచయం చేయాల్సి వచ్చింది. అందుకే కొన్ని సన్నివేశాలను, పాత్రలను పూర్తిగా చూపించలేకపోయాడు.ఓవరాల్ గా సూపర్ హీరోయిన్ కథతో వచ్చిన ఈ కొత్త లోక ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే సూపర్ హీరో గా కళ్యాణి ప్రియదర్శన్ అదరగొట్టింది.యాక్షన్ ,ఎమోషనల్ సన్నివేశాల్లో అదుర్స్ అనిపించింది. చంద్ర పాత్రకు ఆమె బాగా సెట్ అయ్యింది.కళ్యాణి లుక్ కూడా సూపర్ హీరో రోల్ లో తగ్గట్లుగా వుంది. ఆమె కెరీర్ లోనే చంద్ర పాత్ర ప్రత్యేకంగా నిలువనుంది.యంగ్ హీరో నస్లేన్ కామెడీ రోల్ లో సూపర్ అనిపించాడు.సన్నీ పాత్ర ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది.ఇక విలన్ పాత్రలో తమిళ నటుడు , ప్రముఖ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ భయపెట్టాడు.అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోయాడు.మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
టెక్నికల్ గా సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. లిమిటెడ్ బడ్జెట్ లో మంచి క్వాలిటీ తో తెరకెక్కించారు. విఎఫ్ఎక్స్ సూపర్ గా వుంది. విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ షార్ప్ గా అనిపించింది. జేక్స్ బిజోయ్ సంగీతం ,బీజీఎమ్ సినిమాకు మరో హైలైట్ అన్ని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఎక్కడా చిన్న సినిమా చూశాం అనే ఫిలింగ్ కలుగదు.
చివరగా సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన కొత్త లోక చాఫ్టర్ 1: చంద్ర ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్ సాగి ఓ కొత్త సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేయగలిగింది.ఇందులో కళ్యాణి నటన , ఫస్ట్ హాఫ్ ,డైరెక్షన్ , విజువల్స్ హైలైట్ అని చెప్పొచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా వెళితే సినిమాగా బాగా నచ్చుతుంది.ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై ఈసినిమా మంచి అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























