ఇంస్టాగ్రామ్ లో సరికొత్త రికార్డు సృష్టించిన రామ్

Ram’s Instagram Post Creates History

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో తెలుగు హీరోల్లో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.రీసెంట్ గా రామ్ ఇంస్టాలో ఓ పోస్ట్ పెట్టగా దానికి 76 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఏ క్యాప్షన్ లేకుండా, హ్యాష్‌ట్యాగ్‌లు లేకుండా కేవలం ఆయన రాబోయే సినిమాలోని నువ్వుంటే చాలే పాట రిలీజ్ టైం లో ఒక క్యాజువల్ ఫోటో మాత్రమే షేర్ చేశాడు రామ్.ఈ పోస్ట్ మోస్ట్ లైక్డ్ పోస్ట్ గా ఇంస్టాలో రికార్డు సృష్టించింది. ఇంతకుముందు వరకు ఏ తెలుగు హీరో పిక్ కు ఇన్ని లైక్స్ రాలేదు. ఈ రికార్డు ద్వారా రామ్ పోతినేని మరోసారి తన పాపులారిటీని ప్రూవ్ చేసుకున్నాడు.ఇక ఈ ఫీట్ సాధించడంపై రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే రామ్ ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా అనే చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరగుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌, సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ గా ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రానుంది. ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు.పి డైరెక్షన్ లో తెరక్కుతున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఇందులో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.నవంబర్ 28న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.