సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ హైప్ మామూలుగా లేదు.పేరుకు తమిళ సినిమా అయినా అన్ని భాషల్లో ఊహించని రీతిలో హైప్ వుంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100కోట్లు పెట్టిందంటే ఏ రేంజ్ రాంపేజ్ కొనసాగిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.బుక్ మై షో లో ఇప్పటివరకు దాదాపు 20 లక్షలకుపైగా టికెట్స్ తెగాయి.ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 5 లక్షల టికెట్స్ బుక్ అయ్యాయి.ఓ బిగ్ తెలుగు స్ట్రయిట్ సినిమా రిలీజ్ అవుతే ఎలావుంటుందో అలా వుంది.నార్త్ అమెరికాలో అయితే ప్రీ సేల్స్ 3 మిలియన్ మార్క్ చేరువలో వున్నాయి.ఇప్పటివరకు ఇదే ఆల్ టైం రికార్డు.వేరే ఏ తమిళ సినిమా కూడా ప్రీమియర్స్ తో ఈమార్క్ చేరుకోలేదు.ఓవరాల్ గా ఓవర్సీస్ లో ఇప్పటివరకు కూలీ అడ్వాన్స్ సేల్స్ విషయంలో 8 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక్క తమిళం లోనే కాదు అన్ని భాషల్లోనూ కూలీ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. హిట్ టాక్ వస్తే మాత్రం 1000 కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా అవ్వడం ఖాయం.అదే జరిగితే మొదటి 1000కోట్ల కోలీవుడ్ సినిమాగా కూలీ చరిత్ర సృష్టించనుంది.మరి కొద్దీ గంటల్లోనే ఈసినిమా రిజల్ట్ ఏంటో తేలిపోనుంది.
లోకేష్ కనగరాజ్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా కింగ్ నాగార్జున విలన్గా, ఉపేంద్ర, సత్యరాజ్,శృతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందించగా సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























