కాంతారతో ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ నటుడు రిషబ్ శెట్టి. ఈసినిమా తెలుగు ,హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.కాంతార తెచ్చిన ఇమేజ్ తో వరుసగా పాన్ ఇండియా సినిమాలు కమిట్ అవుతున్నాడు రిషబ్ శెట్టి.అన్ని వేటికవే ప్రత్యేకమైనవి. కాంతర తరువాత రిషబ్ శెట్టి సీక్వెల్ కాంతార చాప్టర్ 1తో రానున్నాడు.షూటింగ్ కూడా పూర్తి కాగా అక్టోబర్ 2న విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సెట్స్ మీద ఉండగానే రిషబ్ శెట్టి తెలుగు లో జై హనుమాన్ ఒప్పుకున్నాడు.హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మైత్రి ఈసినిమాకి నిర్మించాల్సి వుంది.అయితే అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు అంతే ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ లేదు.అన్ని అనుకున్నట్లు జరిగితే తెలుగులో రిషబ్ కు ఇదే మొదటి సినిమా కానుంది.
ఇక తె తాజాగా మరో తెలుగు సినిమా కు సైన్ చేశాడు రిషబ్ శెట్టి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఆకాశవాణి ఫేమ్ గుణ్ణం అశ్విన్ డైరెక్షన్ లో రిషబ్ శెట్టి సినిమా చేయనున్నాడు.1770 బ్యాక్ డ్రాప్ లో చారిత్రాత్మక యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.ఇందులో రిషబ్ తిరుగుబాటు దారుడిగా కనిపించనున్నాడు.ఈరోజే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు.త్వరలోనే మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఇవే కాకుండా రిషబ్ శెట్టి ది ప్రైడ్ ఆఫ్ భారత్ :ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా చేయాల్సి వుంది.సందీప్ సింగ్ డైరెక్ట్ చేయనుండగా జనవరి 21, 2027లో విడుదలకానుంది. అలాగే శ్రీ కృష్ణ దేవరాయలు బయోపిక్ కూడా రిషబ్ శెట్టి లైనప్ లో వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























