తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ జంటగా నటించిన సినిమా తలైవన్ తలైవి తమిళనాడు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.4 రోజుల్లో తమిళనాడు లో ఈసినిమా 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో 10కోట్ల వసూళ్లను అందుకుంది.ఇక ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 50కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది. మహారాజ తరువాత విజయ్ సేతుపతికి ఆ రేంజ్ హిట్ కానుంది తలైవన్ తలైవి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాను సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు.ఇక ఈసినిమా తెలుగులో సార్ మేడమ్ గా విడుదలకానుంది.ఆగస్టు 1న థియేటర్లలోకి రానుంది. అయితే ఈసినిమాకు విజయ్ దేవరకొండ, కింగ్డమ్ తో భారీ పోటీ ఎదురుకానుంది.
ఇక విజయ్ సేతుపతి ప్రస్తుతం టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తున్నాడు.ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా టబు కీలక పాత్రలో నటిస్తుంది. ఛార్మి తోకలిసి పూరి సినిమాను నిర్మిస్తున్నారు.ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో రానున్న ఈసినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ప్రచారంలో వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























