పరాశక్తిలో రానా ?

Rana Daggubati to be seen in an important role in Parasakthi

తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న 25వ సినిమా పరాశక్తి. ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతుంది. అయితే షూటింగ్ స్పాట్ లో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కనిపించడం తో ఇందులో తను కూడా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.త్వరలోనే ఈ విషయం లో క్లారిటీ రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో శ్రీ లీల తమిళంలోకి ఎంట్రీ ఇస్తుంది.ఇందులో రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.జివి ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది పొంగల్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక ఈసినిమా కన్నా ముందు శివకార్తికేయన్ ,మదరాసితో రానున్నాడు.మురగదాస్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.త్వరలోనే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.