మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్). ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి వింటేజ్, స్టైలిష్ లుక్‌లో అలరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌కి తగ్గట్టుగా షూటింగ్ స్పీడుగా, ప్లాన్‌డ్‌గా జరుగుతోంది. సినిమా మంచి నస్టాల్జిక్ ఫీల్‌తో ఉండబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలలో జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. టీం ప్రస్తుతం ఒక పాటను చిత్రీకరిస్తోంది. చిరంజీవి, నయనతారలపై ఓ కలర్‌ఫుల్, మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు.
భీమ్స్ సెసిరోలియో అద్బుతమైన సాంగ్‌ని కంపోజ్ చేశారు. పెళ్లి సందడి నేపథ్యంలో జరగుతున్న ఈ పాట పూర్తిగా జాయ్‌ఫుల్, సెలబ్రేటరీ మూడ్‌లో సాగుతుంది. అలాగే కొన్నికీలకమైన సీన్లను కూడా ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ జూలై 23కి పూర్తవుతుంది.
కాగా ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ కో రైటర్స్. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























