విజయ్ సేతుపతి ‘సార్‌ మేడమ్‌’ ట్రైలర్ రిలీజ్

Vijay Sethupathi's Sir Madam Trailer Released

వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, వెరీ ట్యాలెంటెడ్ నిత్యా మేనన్‌ జంటగా నటిస్తున్న రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్‌ మేడమ్‌’. “A Rugged Love Story” అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విదిదలైన ‘సార్‌ మేడమ్‌’ టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘సార్‌ మేడమ్‌’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ”నాతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేశావు. మా అమ్మానాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే తిట్టుకునే విధంగా నిన్ను చూసుకుంటా’ అని విజయ్ సేతుపతి డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

విజయ్ సేతుపతి, నిత్యామీనన్ మధ్య వచ్చే గొడవలు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. పెళ్లి చూపులు, పెళ్లి లాంటి బ్యూటిఫుల్ ఎమోషన్స్‌తో మొదలైన ట్రైలర్ ‘మమ్మల్నిద్దర్నీ విడదీసేయండి’ అని నిత్యామీనన్ చెప్పిన డైలాగ్‌తో ఊహించని మలుపు తీసుకోవడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

పరోటా మాస్టర్‌గా విజయ్ సేతుపతి కనిపించిన సీన్స్ నవ్వులు పూయించాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మాస్ యాక్షన్ కూడా ఉండడం మరింత క్యూరియాసిటీ పెంచింది. ఇక విజయ్ సేతుపతి మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే సేతుపతి, నిత్యామీనన్ కెమిస్ట్రీ స్పెషల్ హైలైట్‌గా నిలిచింది.

డైరెక్టర్ పాండిరాజ్‌ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అందించారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ ఫన్, ఎమోషన్‌ని మరింతగా ఎలివేట్ చేసింది. డిఓపి ఎం సుకుమార్ అందించిన విజువల్స్ బ్యూటీఫుల్‌గా వున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్, ఫన్, రగ్గడ్ లవ్ స్టొరీ, మాస్ యాక్షన్‌తో ‘సార్‌ మేడమ్‌’ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. కాగా ఈ సినిమా జూలై 25న థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.