మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ విశ్వంభరతో రానున్నాడు.తొలి సినిమా బింబిసారా తో సాలిడ్ హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి విశ్వంభర ను డైరెక్ట్ చేస్తున్నాడు .భారీ బడ్జెట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా విఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.ఇక ఆ పనులు కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చాయి.అలాగే ఓ సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.అందుకు సంబంధించిన షూట్ ను ఈనెల 25నుండి స్టార్ట్ చేయనున్నారు. ఈస్పెషల్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ బ్యూటీ ని తీసుకున్నారు.భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ను కంపోజ్ చేయనున్నాడు.ఇందులో చిరు స్టెప్పులు ఓ రేంజ్ లో వుండనున్నాయట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశ్వంభరలో త్రిష కథానాయికగా నటిస్తుండగా ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రీయేషన్స్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
ఇక చిరంజీవి ప్రస్తుతం మెగా 157(వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్నారు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. విక్టరీ వెంకటేష్ ఇందులో క్యామియో రోల్ లో కనిపించనున్నాడు.సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
చిరు ఈసినిమాను కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమాను దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చేయనున్నాడు.నాని, సుధాకర్ చెరుకూరి ఈసినిమాను నిర్మించనుండగా మెగాసార్ట్ కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ ఫిలిం గా తెరకెక్కనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























