ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరవడం విశేషం. ఇక మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరోయిన్ జెనీలియా మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. జూనియర్‌తో మీ అందర్నీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నన్ను మళ్ళీ తెరపైకి తీసుకువచ్చిన టీమ్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. కిరీటికి జూలై 18 వెరీ బిగ్ డే. మేమందరం కూడా తనని సపోర్ట్ చేస్తాము. తన సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటాము” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























