నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆమె నటించిన రెండు చిత్రాలు ‘ఛావా, కుబేర’ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. అలాగే అంతకుముందు ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. కాగా ప్రస్తుతం రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ట్యాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి ఆమెకు జోడీగా కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది. ది గర్ల్ ఫ్రెండ్ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక రష్మిక జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ సాంగ్ ఆకట్టుకుంది. దీనికి హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన ట్యూన్ అందించాడు.
ఈ నేపథ్యంలో వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ పంచుకుంది చిత్ర యూనిట్. ఈ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రానుంది. ‘నదివే’ అంటూ సాగే ఈ పాటను జూలై 16న రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. అయితే టీజర్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ పాటపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























