సూపర్ స్టార్ రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ నుండి నిన్న విడుదలైన సెకండ్ సింగిల్ మోనికా యూట్యూబ్ ను ఊపేస్తోంది.24గంటల కూడా పూర్తి కాకముందే తమిళ , తెలుగు వెర్షన్లు కలిపి 9మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకున్నాయి.సోషల్ మీడియాలో ఈ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. ఇక ఫస్ట్ సింగిల్ తో నిరాశపరిచిన అనిరుధ్ సెకండ్ సింగిల్ తో కం బ్యాక్ ఇచ్చాడు.ఈ సాంగ్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.అనిరుధ్ బీట్స్ కి పూజా హెగ్డే , సౌబిన్ షరీఫ్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. శాండీ మాస్టర్ కొరియోగ్రఫీ అలాగే సాంగ్ పిక్చరైజేషన్ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ తోపాటు తెలుగు వెర్షన్ సాంగ్ కూడా వినడానికి బాగుంది.ఓవరాల్ గా మోనికా చార్ట్ బస్టర్ అనిపించుకుంది. ఈసాంగ్ లో నాగార్జున కూడా కనిపించనున్నాడు. ఈసినిమాలో నాగ్, సైమన్ అనే నెగిటివ్ రోల్ లో నటించగా ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరవనున్నాడు.
సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా ఆగస్టు 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కూలీ 1000 కోట్ల సినిమా కానుంది.అయితే కూలీ వస్తున్న రోజునే హిందీ సినిమా వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది.ఇందులో ఎన్టీఆర్ ఉండడంతో కూలీకి తెలుగులో భారీ పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























