తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ కీరవాణి తండ్రి కోడూరి శివశక్తి దత్తా కన్నుమూసారు. 92 ఏళ్ల వయస్సులో వయోభారం కారణంగా మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ఈయన పెదనాన్న అవుతారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే శివశక్తి దత్తా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గేయ రచయితగా, స్క్రీన్ రైటర్‌గా మంచి గుర్తింపు పొందారు. చిత్రలేఖనంలోనూ ఆయనకు అసాధారణ ప్రతిభ ఉంది. దత్తా చిత్రించిన అనేక హిందూ దేవుళ్ల చిత్రపటాలు, శివాజీ మహారాజ్ కాన్వాస్ తో ఆయన నివాసం ఒక ఆలయంలా కనిపిస్తుంది. కొన్నిరోజులక్రితం ఆయన గీసిన చిత్రపటాలను తిలకించిన బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ మంత్ర ముగ్దుడయ్యారు. ఈ పెయింటింగ్స్‌ని అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.
ఇక శివశక్తి దత్తా గేయ రచయితగా టాలీవుడ్‌కి ఎన్నో హిట్స్ సాంగ్స్ ఇచ్చారు. ‘సై’ సినిమాల్లో ‘నల్లా నల్లాని కళ్ల’ పాట నుంచి గతేడాది వచ్చిన ‘హనుమాన్’ థీమ్ సాంగ్ వరకూ ఎన్నో హిట్ పాటలకు సాహిత్యం అందించారు. అలాగే ‘బాహుబలి’లో ‘మమతల తల్లి, సాహోరే బాహుబలి’.. ఇంకా ‘ఆర్ఆర్ఆర్’లో ‘రామం రాఘవం’ పాటలను రచించినది దత్తానే కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాకి కొన్ని పాటలు కూడా రాసినట్టు సమాచారం.
కాగా తనయుడు కీరవాణికి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటునాటు’ పాటకి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ వచ్చినప్పుడు దత్తా సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఈ సందర్భంగా మూడో ఏట నుంచే కీరవాణికి సంగీతం నేర్పించానని, చిన్నప్పటి నుంచి కీరవాణి టాలెంట్ చూసి ఆశ్చర్యపోతూనే ఉన్నానని తెలిపారు.
1932లో అక్టోబర్ 8న కొవ్వూరులో జన్మించిన శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. కళలపై ఆసక్తితో ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయి ముంబయిలోని ఓ ఆర్ట్స్ కాలేజీలో చేరారు. రెండేళ్ల తర్వాత కొవ్వూరుకు తిరిగొచ్చారు. ‘కమలేశ్’ అనే కలం పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు. ఆ తర్వాత సంగీతంపై ఇష్టంతో గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలపై ఇష్టంతో చిత్రపరిశ్రమలోకి వచ్చారు.
ఈ క్రమంలో నాగార్జున నటించిన ‘జానకిరాముడు’ చిత్రానికి స్క్రీన్ రైటర్‌గా పని చేశారు. అనేక సినిమాలకు పనిచేసిన ఆయన 2007లో ‘చంద్రహాస్’ అనే చిత్రాన్ని డైరక్ట్ చేశారు. కాగా శివశక్తి దత్తాకు మొత్తం ముగ్గురు సంతానం.. కీరవాణి, కల్యాణి మాలిక్, శివశ్రీ కంచి. ఆయనకు ఒక అన్న, అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. రాజమౌళి తండ్రి, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆయనకు తమ్ముడు అవుతారు.
కాగా శివశక్తి దత్తా మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి లోనైంది. సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా కీరవాణి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నాం మహా ప్రస్తానంలో దత్తా అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























