కీర్తి సురేష్ – సుహాస్ ‘ఉప్పు కప్పురంబు’ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్

Keerthy Suresh and Suhas' Uppu Kappurambu Music Album Unveiled

భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో సమర్పిస్తోన్న తాజా తెలుగు ఒరిజినల్ సినిమా ‘ఉప్పు కప్పురంబు’. కీర్తి సురేష్ – సుహాస్ ప్రధానపాత్రల్లో నటించారు. జూలై 4న స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేసింది. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్‌లో మూడు ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పాటలు చిత్రంలో చూపించే చిన్న పట్టణ జీవితం, హాస్యం, భావోద్వేగాలు అన్నింటినీ మనస్సుకు హత్తుకునేలా పాడబడ్డాయి. ఈ సినిమాకి స్వీకార్ అగస్తి సంగీతాన్ని సమకూర్చగా.. రవికృష్ణ విస్సాప్రగడ, ఎస్. అత్తావుర్ రహీం మరియు రఘురాం ద్రోణావజ్జల సాహిత్యం అందించారు. సీన్ రోల్డన్, అనురాగ్ కులకర్ణి ఆంటోని దాసన్ గానంతో పాటలు ఇంకా హృద్యంగా మారాయి.

ఒకవైపు ‘నోమిలాలా’ అనే పాట ఉత్సవాన్ని పాడుతుంటే, మరోవైపు ‘యాడున్నావో’ అనే పాట ఒక తల్లి-బిడ్డ మధ్య దూరాన్ని హృదయాన్ని తాకేలా చూపుతుంది. అలాగే టైటిల్ సాంగ్ ‘ఉప్పు కప్పురంబు’ పాటలో గ్రామీణ శైలి, ఉల్లాసం, ధైర్యం అన్నీ కలిసి ఉంటాయి. ఇక ఈ పాటలు ఇప్పుడు అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై, జియోసావన్, ఆపిల్ మ్యూజిక్ లాంటి ప్రముఖ మ్యూజిక్ యాప్స్‌లో వినేందుకు అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.