యంగ్ నితిన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. ఈ ప్రెస్టీజియస్ ఫిల్మ్‌లో సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రలో కనిపించనుండగా.. ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ, స్వాశిక విజయ్, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు, ‘యానిమల్’ ఫేమ్ సౌరభ్ సచ్దేవ్, కిషోర్ రాజు వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘కాంతారా’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరుతో గ్లింప్స్, థియేట్రికల్ ట్రైలర్ మరియు 2 పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. జూలై 4న తమ్ముడు థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది.
తమ్ముడు సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. అయితే సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి A సర్టిఫికేట్ అందించడం గమనార్హం. ఇందులో యాక్షన్ సీన్స్‌లో హింస పాళ్ళు కొంచెం ఎక్కువైనందునే సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక సెన్సార్ కూడా పూర్తి కావడంతో తమ్ముడు రిలీజ్‌కి రెడీ అయిపోయినట్టే. కాగా తమ్ముడు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటికే సొంతం చేసుకుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























